రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. ఓట్ల కోసం ప్రజలకు డబ్బు ఆశ చూపించి , ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ కమిషన్ ను కోరారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపుర్ మండలం గూడూరులో గౌడ కులస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే… ఎల్లమ్మ గుడి నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అందరి చేత ఎల్లమ్మ అమ్మవారిపై ప్రమాణం చేయించారు.
బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న ధర్మారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు యుగేందర్ గౌడ్. అలాగే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరారు.