అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించ పరిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు దళిత బహుజన సంఘాల నేతలు. మంగళవారం బడ్జెట్ పై మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ రాజ్యాంగాన్ని కించ పరిచేలా మాట్లాడారని వారు ఆరోపించారు.
ఈ మేరకు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కేసీఆర్ నిరంకుశ పాలనను హతం చేస్తామని, కేసీఆర్ కు మతి భ్రమించిందని అన్నారు. క్షమాపణలు చెప్పకపోతే దళిత, బహుజనలుగా కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తామన్నారు.