ఎట్టకేలకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలయ్యింది. స్వయంగా సీఎం కేసీఆర్ రేపటి లోపు మీకు దళిత బంధు పైసల్ పడ్తయ్ అని చెప్పినా నెల రోజులైన అధికారులు డబ్బులు వేయలేదు. మొత్తం 76కుటుంబాలను అర్హులుగా తేల్చగా, అందులో 66మందికి తొలి విడతగా ఒక్కో కుటుంబానికి 10లక్షలు అకౌంట్ లో వేశారు.
కేసీఆర్ దత్తత గ్రామంలో దళిత బంధుకు దిక్కు లేదు… అధికారులు కొర్రీలు పెడుతూ రోజులు గడుపుతున్నారని తొలివెలుగు కథనం కూడా ప్రచురించింది. డెయిరీ ఫాం పెట్టాలనుకునే వారికి గడ్డి ఎలా అని, ట్రాక్టర్ కొనుక్కుంటా అంటే ఎక్కడ నడుపుతరు అంటూ అధికారులు వెటకారంగా మాట్లాడరంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ బడ్జెట్ ఇచ్చిన డబ్బులివ్వరా అని వారు ప్రశ్నించారు.
అధికారులు కొర్రీలు పెడుతున్నారంటూ తొలివెలుగు రాసిన కథనం-
Advertisements