మన ఇండియన్ సినిమాలో డాన్స్ మాస్టర్ లు దర్శకులుగా మారడానికి కాస్త ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అందులో ప్రభుదేవా, రాఘవ లారెన్స్ ముందు వరుసలో ఉంటారు. వీళ్ళు బాలీవుడ్ లో సైతం సినిమాలు చేయడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఇలా డాన్స్ మాస్టర్ లే దర్శకులుగా మారి చేసిన సినిమాలు చూద్దాం.
ప్రభుదేవా
ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా… నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాతో దర్శకుడిగా మారి హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత పౌర్ణమి సినిమా షాక్ ఇచ్చింది. కొన్నాళ్ళకు బాలీవుడ్ కి వెళ్లి సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో సూపర్ హిట్ లు కొట్టాడు.
రాఘవ లారెన్స్
అగ్ర హీరోలకు డాన్స్ మాస్టర్ గా చేసిన లారెన్స్… నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. కాంచన, గంగ వంటి సినిమాలు చేసాడు. ప్రభాస్ తో చేసిన రెబల్ షాక్ ఇచ్చింది.
అమ్మ రాజశేఖర్
అప్పట్లో లారెన్స్ కి పోటీ గా వచ్చిన ఈయన కూడా దర్శకుడు అయ్యారు. గోపిచంద్ హీరోగా చేసిన రణం సినిమా మంచి హిట్ ఇచ్చింది.