వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పేరు చెప్పి దందాలకు పాల్పడుతున్న యువకులను మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా కొంత మంది యువకులు నందిగామ సురేష్ పేరు చెప్పి ఒక స్కార్పియో పై ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని దందాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మంగళగిరి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ వివాదంపై వచ్చిన యువకులు ఎంపీ పేరు చెప్పుకుని పెత్తనం చెలాయించారు. ఆ విషయం తెలుసుకున్న నందిగామ సురేష్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. తన పేరు చెప్పుకుని దందాలకు పాల్పడుతున్న యువకులను మందలించారు. కార్ కు ఉన్న స్టిక్కర్ ను తొలిగించి ఇలాంటి పనులు చెయ్యకందంటూ హెచ్చరించారు.