జడ్చర్లలో లక్షల రూపాయల విలువైన పేలుడు పదార్థాలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.10 లక్షల విలువైన 2,500 డిటోనేటర్లు, 2,750 జిలేటేన్స్ పట్టుబడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
వడ్డే బాలయ్య అనే వ్యక్తి తన కంప్రెషన్ తో గుట్టలను బండరాలను పేల్చేందుకు రాజేష్ అనే మధ్యవర్తి ద్వారా ఈ పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాడు.
పేలుడు పదార్థాలను స్థానిక పోలీసులు స్టేషన్ కు తరలించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ.. జడ్చర్ల సీఐకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. పట్టణంలో ఇలాంటివి ఇంకేమైనా ఉంటే తనిఖీలు చేసి వాటిని నిర్వహిస్తున్న యజమానులను బైండోవర్ చేయాలని జిల్లా ఎస్పీ చూచించినట్లు పోలీసులు పేర్కొన్నారు.