తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం సార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా ధనుష్ ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
అందులో టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ పాత్ర లో కనిపించబోతున్నాడు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తుండగా దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
సార్‌తో పాటు, ధనుష్ మరికొన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మారన్ సినిమా చేస్తున్నాడు. అలాగే ది గ్రే మ్యాన్, తిరుచిత్రంబలం, నానే వరువెన్, “A02” సినిమాలు కూడా చేస్తున్నాడు.