సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాంలోకి వచ్చినట్లే కనపడుతోంది. దర్బార్తో వచ్చిన రజినీ ఫస్ట్ డే డిసెంట్ వసూళ్లతో తన మార్క్ చూపించగలిగాడు. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లనే రాబట్టింది. తమిళనాడులో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోగా తెలుగులో కూడా పర్వాలేదనిపించింది. తమిళనాడులో 15కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఒక్క చెన్నైలోనే కోటికి పైగా రాబట్టగలిగిందని సమాచారం. నైజాం కలెక్షన్స్‌తో దర్బార్ తెలుగులో కలెక్షన్స్‌లో ఓకే అనిపించుకుంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రజినీ 35కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ఇండస్ట్రీ టాక్.
అయితే సంక్రాంతి సెలవులు మొదలవుతుండటంతో… తమిళ్లో కలెక్షన్స్ మరింత పెరిగే చాన్స్ ఉండగా, తెలుగులో మాత్రం క్రమంగా తగ్గే అవకాశం కనపడుతోంది.