దక్షిణాది సీనీ తారలతో ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. రెమ్యునరేషన్ అధికంగానే తీసుకుంటున్నప్పటికీ నయన్ మాత్రం మూవీ ప్రమోషన్ కు దూరంగా ఉంటూ వస్తుంది. దర్శక నిర్మాతలు తనను సంప్రదించిన సమయంలోనే నయన్ తాను సినిమాలో నటిస్తాను కానీ ప్రమోషన్ కు మాత్రం హాజరవ్వలేనని చెప్పేస్తుంది.
స్టార్ హీరో రజనీకాంత్ దర్బార్ సినిమా ప్రమోషన్‌కు కూడా నయన్ దూరంగానే ఉంది. అయితే ఈ విషయమై నయన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ ఆమె మాత్రం లైట్ తీసుకుంటుంది. ఎంత పెద్ద ఇష్యూ జరిగినా డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా తారలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కానీ నయన్ మాత్రం సోషల్ మీడియాకు కూడా దూరం పాటిస్తూ ఏ విషయాలపై కూడా స్పందించదు. తనను స్క్రీన్ పై తప్పితే మరెక్కడా చూడలేరనేలా నయన్ వ్యవహారశైలి ఉంటుంది.
అయితే తాజాగా నయనతార టీవీ అవార్డుల వేడుకల్లో పాల్గొన్నది. ఇక్కడే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి చిర్రెత్తుకొచ్చింది. సినిమా ప్రమోషన్ కు దూరంగా ఉంటూ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు ఎలా హాజరు అయిందంటూ కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.