శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన, కింజారపు ఫ్యామిలీల చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. అటు టీడీపీలో కింజారపు ఇటు వైసీపీలో ధర్మన రాజకీయాలను తమ గుప్పిటలో పెట్టుకునేందుకు సర్వ శక్తులు వడ్డుతుంటారు. జిల్లాలో ప్రధాన సామాజిక వర్గమైన వెలమలకు ప్రాతినిద్యం వహిస్తున్న ధర్మాన ప్రసాదరావును అంతా తమ వారిగానే చెప్పుకుంటారు. పది నియెజకవర్గాలలో ధర్మాన ప్రసాద్ కు పాలోవర్స్ ఉన్నారు. వైఎస్ హాయాంలో ధర్మాన ఓ వెలుగు వెలిగారు. కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ ఇటు జిల్లా స్దాయిలోనే కాకుండా ఉమ్మడి రాష్ర్ట రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ధర్మాన ప్రసాద్ కంటే కృష్ణదాస్ వయసులో పెద్ద అయినా రాజకీయంగా , నాయత్వం పరంగా కృష్ణదాస్ తమ్ముని వెనకుంటూ వచ్చారు. అన్న కోసం సొంత నియోజకవర్గం నరసన్నపేటను వదులుకొని ధర్మాన ప్రసాద్ శ్రీకాకుళం షిప్ట్ అయ్యారు . రాష్ర్ట విభజన , వైసీపీ ఏర్పాటు వంటి అంశాలతో ధర్మాన వేసిన లెక్కలు తప్పడంతో , కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవడం జరిగింది. కృష్ణదాస్ తమ్ముడి కి వ్యతిరేకంగా జగన్ వెంట నడిచారు. జిల్లాలో మెదటి సారిగా జగన్ కు బాసటగా నిలవడంతో ధర్మాన కృష్ణదాస్ పట్ల జగన్ సానుకూలంగా ఉండటం తన ప్రభుత్వంలో మంత్రిగా స్దానం కల్పించడం జరిగిపోయాయి. దీంతో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ధర్మాన ప్రసాద్ అండ్ కో తమ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కుటంబ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ కు సహకరించడంలేదన్నది బహిరంగ రహస్యం.
అధికార వైసీపీలో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన విభేదాలు అగాధాన్ని సృష్టిస్తున్నాయి . 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఫ్యాన్ గాలికి పదిలో ఎనిమిది సీట్లు గెలిచారు. ఐతే పార్టీ అధికారంలో కి వచ్చి ఆరునెలలు గడవక ముందే జరుగుతున్న పరిణామాలకు సగటు కార్యకర్త కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఆరునెలల కాలంలో ప్రభుత్వ పరంగా ప్రధాన కార్యక్రమాలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో నే నిర్వహిస్తు వస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు నియామక పత్రాల జారీ, సన్నబియ్యం పంపిణీ, అగ్రిగోల్డ్ చెక్కుల పంపిణీ మెదలు అనేక కార్యక్రమాలకు స్దానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ హాజరుకావడంలేదు . కొన్ని కార్యక్రమాల సందర్బంలో పట్టణంలో అందుబాటులో ఉన్నా కూడా కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ధర్మన సోదరుల మద్య విభేదాలు , భేదాబిప్రాయాలు ఉన్నాయో లేదో తెలియదు , కానీ పరిణామాలన్నీ ఉన్నట్లే కనిసిస్తున్నాయి. ధర్మాన ప్రసాద్ తన నియెజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొనకపోవడం ప్రక్కన పెడితే కనీసం ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఎక్కడా కనిపించడంలేదు . దీంతో కేడర్ కు రాంగ్ సిగ్నల్స్ పంపించినట్లు అవుతుందని అంటున్నారు పార్టీ శ్రేయోభిలాషులు . శ్రీకాకుళం పట్టణంలో తన తమ్ముడు ప్రసాదరావు సహాయనిరాకరణ చేస్తుండటంతో శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పొరుగున్న ఉన్న తన నియెజకవర్గం నరసన్నపేట నుంచి కార్యకర్తలను తెచ్చుకోవలసి వస్తుందంటే అర్దం చేసుకోవచ్చు,
కష్టకాలంలో అండగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ కృష్ణదాస్ కు సముచిత స్దానం కల్పించారు. జగన్ విధేయతకు పట్టం కట్టారన్న వర్గం ఒకటి ఉంటే , రాష్ర్ట స్దాయిలో రాజకీయాలను నెరపిన తమ నేతను కేవలం ఒక నియెజకవర్గానికి పరిమితం చేయటం భావ్యం కాదని మరో వర్గం బలంగా వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా ధర్మాన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గిల్లి కజ్జాలు సద్దమనగకపోతే , టిడిపి కి ఖంచుకోటలాంటి జిల్లాలో ప్రత్యర్ధులు మరింత వేగంగా పావులు కదుపుతారన్నది వాస్తం . ఈ విషయం గుర్తెరిగి ముఖ్యమంత్రి తమ నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు,