హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లే ఎక్కువ కష్టపడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో రాత్రింబవళ్ళు పనిచేసిన వారు ఆ తర్వాత టీఆర్ఎస్‌కు దూరమయ్యారని ధర్మపురి అరవింద్ అన్నారు. లక్ష ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తారా ? గులాబీ జెండాకు కేసీఆరే యజమాని అంటూ ఎర్రబెల్లి చెప్పడం ఎంతవరకు సబబు ? అని అరవింద్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యవసాయ మంత్రికి సోయ వుందా?
దేశమంతటా ఎరువు సరఫరా ఉందని, తెలంగాణ వ్యవసాయ మంత్రికి మాత్రం సోయ లేదని అరవింద్ దుయ్యబట్టారు. పసుపుపై రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు.