హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. అంతేకాదు, ఈ సినిమాకు నిర్మాత కూడా ఇతడే. చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఇప్పటివరకూ విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావాబ్రో పాటలు పెద్ద హిట్టయ్యాయి. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ పెద్ద ట్రెండ్ అయ్యింది.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.