నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. మార్చిలో ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. మరోవైపు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. అంతలోనే ఈ సినిమాపై ఊహించని ఊహాగానం ఒకటి చెలరేగింది.
దసరా సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. మొదటి భాగాన్ని మార్చి నెలలో, రెండో భాగాన్ని నవంబర్ లో రిలీజ్ చేస్తారనే ప్రచారం అందుకుంది. దీంతో యూనిట్ రంగంలోకి దిగింది. రుమార్లకు తెరదించే ప్రయత్నం చేసింది.
ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా నాని రంగంలోకి దిగాడు. దసరా సినిమా రెండు భాగాలుగా రావడం లేదని స్పష్టం చేశాడు. అయితే రెండు భాగాలు కలిపితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, ఒక్క సినిమానే అంత ప్రభావవంతంగా ఉంటుందంటూ ట్వీట్ చేశాడు.
కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. 30వ తేదీన టీజర్ రిలీజ్ అవుతోంది.