దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేం కాదు. సుకుమార్ ఆల్రెడీ ఆ పని చేస్తున్నాడు. హరీశ్ శంకర్, త్రివిక్రమ్ లాంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు. అతడే దశరథ్. దర్శకుడిగా ఫేడ్ అవుట్ అయిన డైరక్టర్, నిర్మాతగా మారాడు. తన ఫ్రెండ్ తో కలిసి సినిమా తీశాడు.
లవ్ యు రామ్ అనేది దశరథ్ నిర్మించిన కొత్త సినిమా. మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై దశరథ్, డీవై చౌదరి ఈ సినిమాను నిర్మించారు. అంతేకాదు.. ఈ సినిమాకు దశరథ్ కథ అందిస్తే, ఆయన భాగస్వామి డీవై చౌదరి డైరక్షన్ చేశాడు.
రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాతో నిర్మాతగా మారడంతో పాటు… ఇకపై సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని ప్రకటించాడు దశరథ్. అంతేకాదు, బయట సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందిస్తానని తెలిపాడు. సోలోగా అతడికి డైరక్షన్ ఛాన్సులు రావడం లేదు.