పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ నెల్లోనే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పట్నుంచి మొదలవుతుందనేది ఎవ్వరికీ తెలియదు.
ఇదిలా ఉండగా, ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఆసక్తిరక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం కేవలం హరీశ్ శంకర్ మాత్రమే కాదు, మరో దర్శకుడు కూడా పని చేస్తున్నాడు. అతడే దశరథ్.
గతంలో సంతోషం, మిస్టర్ పెర్ ఫెక్ట్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ దర్శకుడు, ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. హరీశ్ శంకర్ తో కలిసి స్టోరీపై వర్క్ చేస్తున్నాడు ఈ డైరక్టర్.
ఈ విషయాన్ని హరీశ్ స్వయంగా బయటపెట్టాడు. సంతోషం సినిమా టైములో తను అసిస్టెంట్ గా ఉన్నానని, అప్పటికే దశరథ్ టాప్ పొజిషన్ కు చేరుకున్నాడని, అలాంటి దర్శకుడితో ఇప్పుడు వర్క్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.