ఎంత అందంగా ఉన్నా, టాలెంట్ ఉన్నా సరే సినిమా పరిశ్రమలో నిలబడాలి అంటే అద్రుష్టం ఉండాలి. కొందరితో మంచి పరిచయాలు అయినా ఉండాలి. అన్నీ ఉన్నా సరే ఎవరి మద్దతు లేకపోతే మాత్రం నిలబడటం కష్టంగా మారుతుంది. ఇలా చాలా మందికి మంచి సపోర్ట్ లేక సినిమా పరిశ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. టాలీవుడ్ లో అలా చాలా మంది కనుమరుగు అయిపోయారు.
Also Read:పరేడ్ గ్రౌండ్.. పాలిటిక్స్..!
అలా ఒక హీరోయిన్ కొందరి స్పీడ్ ముందు నిలబడలేక కనుమరుగు అయిన పరిస్థితి వచ్చింది. ఆమె ఎవరో కాదు జయచిత్ర. జయప్రద, శ్రీదేవి, జయసుధ ముందు ఆమె నిలబడలేకపోయారు. అయితే దాసరి నారాయణ రావు మాత్రం ఆమె విషయంలో కాస్త సానుకూలంగా ఉండేవారు. ఆమె లావుగా ఉండటంతో అవకాశాలు రాలేదు అనుకున్నారు చాలా మంది. రావణుడే రాముడైతే అనే సినిమాను దాసరి చేసారు.
ఈ సినిమాలో ముందు జయసుధని తీసుకోవాలి అనుకున్నారు ఆయన. కాని ఎందుకో లావుగా ఉన్నా సరే జయచిత్ర ను ఎంపిక చేసారు. ఆమె కోసం ఒక పాట కూడా రాయించారు దాసరి. రవివర్మకే అందని అందానివో అంటూ వేటూరి చేత పాట రాయించడం అప్పట్లో సంచలనం అయింది. ఆ పాట సూపర్ హిట్ అయింది కూడా. ఆ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి.
Also Read:కేరళలో నోరో వైరస్.. అప్రమత్తం అవసరమంటున్న నిపుణులు