బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటూ కష్టమని అడిగిన ప్రతివారికి సహాయం చేస్తున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది వలస కార్మికులకు సహాయపడి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు సోనూ. అయితే సోనూ రియల్ హీరో అని పూరీ జగన్నాథ్ ముందుగానే చెప్పాడంటూ ఈ నెటిజన్ ట్వీట్ చేశాడు. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో సోనూసూద్ విలన్‌గా నటించాడు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో నేను హీరో అంటూ సోనూ డైలాగ్ చెబుతాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది పూరీ జగన్ అన్నయ్య. సోనూసూద్ భాయ్.. మీరు రియల్ హీరో అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన పూరి.. సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు.
I know Sonu always a hero😀💪🏽 https://t.co/bYOAQb09iJ
— PURIJAGAN (@purijagan) August 1, 2020