బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ సూపర్ హిట్ అని ‘పైసా వసూల్’ ప్రూవ్ చేసింది. మళ్లీ ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. బోయపాటి శ్రీను సినిమా పూర్తికాగానే బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ ఉంటుందని టాక్.
కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి. రిపీట్ అయితే బావుండునని ఫాన్స్ తహతహలాడతారు. బాలయ్య-పూరి కాంబినేషన్ అలాంటిదే. గతంలో పూరి డైరెక్షన్‌లో బాలయ్య వెరైటీ రోల్‌లో చేసిన ‘పైసా వసూల్’ ఫాన్స్‌ని బాగా ఖుషీ చేసింది.
ప్రస్తుతం బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. ఇప్పటికే తన 105వ చిత్రంగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం వస్తున్నది. ఇదిలా ఉండగానే బోయపాటితో బాలకృష్ణ 106వ చిత్రం చేస్తున్నట్లు ద్వారకా క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ – పూరి జగన్నాథ్ చిత్రం ఉంటుందని ట్రేడ్ వర్గాల టాక్. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’లో తేడా సింగ్ కేరెక్టర్‌లో అలరించిన బాలయ్య ఈ మూవీలో ఎలాంటి గెటప్‌లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేస్తాడోనని ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బోయపాటి-బాలయ్య క్రేజీ జోడీ
ఇక మరో హిట్ కాంబి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను అప్ కమింగ్ మూవీ ప్లాన్ ఫాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినీ ప్రియుల్ని ఎంతో అలరించాయి. ఈ రెండు చిత్రాల్లోనూ బోయపాటి తన అభిమాన హీరో బాలయ్యను ఎంతో కొత్తగా చూపించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది.
బోయపాటి-బాలయ్య గత చిత్రాల్లాగే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు భిన్నమైన గెటప్పుల్లో ఆకట్టుకుంటారని చిత్ర బృందం ప్రకటించింది. బాలకృష్ణకు ఇది 106వ చిత్రం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. బాలయ్యకు సరసన ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ద్వారకా ప్రొడక్షన్స్ పతాకంపై మిరియాల రవీంద్రరెడ్డి ఈ మూవీ నిర్మించనున్నారు.