దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి
జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో.. పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. వీడియో ఫుటేజ్ ఉన్నా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకు ఘటనాస్థలంలో లేడని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. కానీ.. సీవీ ఆనంద్ ఎమ్మెల్యే కొడుకు కారు దిగి వెళ్లిపోయాడని చెప్పడం వెనక ఉన్నమర్మం ఏంది.
దిశ ఘటనలో నిందితుల వివరాలు నిమిషాల్లో బయటపెట్టిన పోలీసులు.. జూబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన వివరాలు ఎందుకు చెప్పడం లేదు. అఘాయిత్యానికి వాడిన కారు ఎవరిదో ఎందుకు చెప్పడం లేదు. పోలీస్ వ్యవస్థ ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ అఘాయిత్యాలకు అడ్డాగా మారింది.
బాధితురాలి తండ్రి మే 31న ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేసేందుకు ఏడు రోజుల సమయం ఎందుకు పట్టింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కాకపోయి ఉంటే కేసు నుంచి ఎమ్మెల్యే కొడుకును తప్పించేవారు. టీఆర్ఎస్ హయాంలో పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
Advertisements
వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నోరు తెరవడం లేదు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ లో పనికి మాలిన అంశాలపై స్పందించే కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. డ్రగ్, పబ్ కల్చర్ కట్టడికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి.