డా. దాసోజు శ్రవణ్.. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి
మేకిన్ ఇండియాలో భారీ అవినీతి జరుగుతోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. ప్రజలసొమ్మును కార్పొరేట్ కంపెనీలకు మోడీ సర్కార్ దొడ్డి దారిన కట్టబెడుతుంది. ఫేం పథకం ద్వారా జరిగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారీ అవినీతి జరిగింది. మేకిన్ ఇండియా ప్రోగ్రాం 100 శాతం ఫెకిన్ ఇండియాగా మారింది. 2021-2022 ఫైనాన్సియల్ ఇయర్స్ లో హీరో కంపెనీ 1.40 లక్షల స్కూటర్లు అమ్మేశారు. దానికి 400 కోట్ల సబ్సీడీ.. ఒక్కొక్క వాహనానికి సగటు సబ్సీడీ 29 వేలు.. కేంద్రం ఇచ్చింది. ఫేం నిబంధనలకు విరుద్దంగా లిథియం బ్యాటరీల తోపాటు.. చాలా పార్ట్ లు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుంది.
ప్రజలు చెమటోడ్చి కట్టిన డబ్బుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్పోరేట్ కంపెనీలకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. స్కూటర్ లు తయారు చేయడానికి 200 పరికారాలు అవసరం. అందులో 18 కీలక పరికరాలను ఇండియాలో తయారుచేయాలని చాల స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ మేకిన్ ఇండియా.. ఫేం టు అనే పధకం కింద మోటార్ వాహనాలు తయారు చేసింది. ఈ పధకం కింద సబ్సిడీ రావాలంటే.. కంపెనీ ఇండియాలోనే ఉండటంతో పాటు.. వాహనంకు కావాల్సిన బాగాలన్నీ ఇక్కడే తయారైనప్పుడే సబ్సీడీలు ఇవ్వాలి. కానీ.. పాలసీకి విరుద్దంగా హీరో ఎలక్ట్రిక్ మోటర్ వెహికిల్ విదేశాల నుంచి పార్ట్స్ ని దిగుమతి చేసుకొని వాహనాలు తయారు చేసింది కేంద్రం.
ఈ పథకానికి ఇప్పటికి కేంద్రం రూ. 10 వేల కోట్లు సబ్సీడీ కింద కేటాయించింది. గత ఏడాది రూ. 1234.69 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది దాదాపు రూ. 3000 కోట్లు కేటాయించింది. డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ ఉన్న ఈ రోజుల్లో.. ఇంత దర్జాగా పబ్లిక్ సొమ్ము దోచుకుంటున్నారు అంటే.. అది కేవలం ప్రభుత్వ అలసత్వం, అవినీతి వైఖరి మాత్రమే. అడ్డగోలుగా దోచుకుంటుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది..? సెంట్రల్ విజిలెన్సు డిపార్ట్మెంట్, జీఎస్టీ డిపార్ట్మెంట్, సీబీఐ ఏమి చేస్తున్నట్టు.
ఒక్క హీరో కంపెనీ మాత్రమే కాకుండా మరో 51 కంపెనీలు కూడా ఇదే పని చేస్తున్నాయని అనుమానం కలుగుతోంది. ఫేమ్ టు పాలసీని అడ్డదారి పట్టించి.. ఆత్మ నిర్బర్ భారత్ అని మోడీ చెప్తున్నారు. ఇది మేకిన్ ఇండియా కాదు.. ఫేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం. దీని పేరుతో విదేశీ పెట్టుబడిదారులను దారుణంగా చీట్ చేస్తుంది మోడీ ప్రభుత్వం. ఈ దోపిడీ దుర్మార్గంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టి దోషులను ప్రజల ముందు నిలబెడతాం. ప్రభుత్వానికి నీతి, నిజాయితీ ఉంటే.. వెంటనే మొత్తం ఫేమ్ పథకంపై సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపించి.. నిజానిజాలు బయటకు తెచ్చి దోషులను శిక్షించాలి. అడ్డదారిన సబ్సిడీ ద్వారా దారిమళ్లిన ప్రజల సొమ్మును తిరిగి రాబట్టుకోవాలి.