దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాదో..? రాదో..? అనే భయంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లో 4539 గజాల భూమి అధికారికంగా టీఆర్ఎస్ కబ్జా చేయడం నేరం. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ అధికారిక భూకబ్జా. రౌడీలు బెదిరించి భూ కబ్జాలు చేస్తే, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తన అధికారాన్ని దుర్వినియోగపర్చి.. దొడ్డి దారిన జీవో లు తెచ్చి ఖరీదైన భూములు కబ్జా చేస్తోంది.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి భూములు లేవు. దళితులకు 3 ఎకరాల ఇచ్చేందుకు భూములు లేవు. కుల సంఘాలకు ఊరు అవతల వెలివేసినట్టు భూ కేటాయింపులు. కానీ.. టీఆర్ఎస్ కు మాత్రము 100ల కోట్ల విలువైన భూములు బంజారాహిల్స్ లో. ఇది నిలువు దోపిడి కాదా..? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారు. వేల కోట్ల విలువైన ఫిలింనగర్ భూములను రెడ్ పోర్ట్ కంపెనీ పేరుతో ఎంపీ రంజిత్ రెడ్డికి 11 ఎకరాలు కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వ్యాపారం కోసం అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములను టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయం అవసరమా..? ఎవడబ్బ సొమ్మని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు.
దానం నాగేందర్ 10 వేల ఇండ్లు కట్టిస్తానని మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదు. ఆయనకు పేదల ఇండ్లకు భూమి దొరకడంలేదు కానీ
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి మాత్రం ఎకరాలకు ఎకరాలు భూమి దొరుకుతుంది. టీఆర్ఎస్ పార్టీకి అక్రమ కేటాయింపు చేసిన జీవో 47 ను వెంటనే రద్దు చేయాలి. ఆ స్థలంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలి.