డా. దాసోజు శ్రావణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హుజురాబాద్ భయం పట్టుకుంది. ఎలక్షన్ కమిషన్‌ని ముందు పెట్టుకొని డ్రామా ఆడుతున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికీ రూ.300 కోట్లు ఖర్చు చేయించిన కేసీఆర్.. అక్కడ ప్రజల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలని ఆలస్యమయయ్యేలా పన్నాగం పన్నుతున్నారు. ఎలక్షన్ కమిషన్, బీజేపీకి నిబద్ధత ఉంటే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి.
గతంలో జీహెచ్ఎంసి ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక సమయంలో కూడా కరోనా ప్రబలంగా ఉంది. అప్పుడు ఎన్నిక వద్దని కాంగ్రెస్ పార్టీ తరపున కోరాం. అప్పుడు లెక్క చేయని కేసీఆర్ ఇప్పుడు హుజురాబాద్‌లో ప్రతికూలత ఉండటంతో ఎన్నికని ఆలస్యం చేసే విధంగా డ్రామా ఆడుతున్నారు. ఇంద్రవెళ్లిలో దళిత గిరిజన దండోరా సభతో టీఆర్ఎస్ నియంత పాలన నుంచి విముక్తి లబిస్తుందనే భరోసా తెలంగాణ సమాజంలో కలిగింది. ప్రత్యేక తెలంగాణ సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. అదే సమయంలో టీఆర్ఎస్ గుండెల్లో గుబులు పుట్టింది. అందుకే కలుగులోంచి వచ్చిన ఎలుకల్లా ఓటమి భయంతో టీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎంత గింజుకున్నా .. కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు.