• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయంపై సమగ్ర విచారణ జరిపించాలి- దాసోజు శ్రవణ్

Published on : October 25, 2019 at 7:25 pm

ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయం పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరిపించాలి… శ్రవణ్ డిమాండ్

హై కోర్ట్ తీర్పులను బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా కెసిఆర్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డట్లే – శ్రవణ్ ఆరోపణ

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినంత మాత్రాన, తెలంగాణ సమాజం మొత్తం ఆమోదించినట్టు కాదని గుర్తు పెట్టు కోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సముద్రంలో అలలు ఉన్నట్టు ఆటుపోట్లు సహజం. ఓటమిని హుందాగా స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అపజయాన్ని స్వీకరిస్తోందని చెప్పారు. ఎన్నికలలో గెలిచినంత మాత్రాన కెసిఆర్ నియంతృత్వ ప్రభుత్వ విధానాల కు ప్రజల మద్దతు ఉన్నట్టు కాదు అని శ్రవణ్ అన్నరు.

నిన్న ముఖ్యమంత్రి చాలా అహంకార పూరితంగా, అప్రజస్వామికంగా మాట్లాడారు. పైగా ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు, విపక్షాలపై , జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం బాధాకరమని అన్నారు.

ప్రతిపక్షాలు ప్రతి పక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, తమ పంథా మార్చు కోవాలని కెసిఆర్ అన్న మాటలకు, సమాధానంగా సంతలో గొడ్లను కొనుగోలు చేసినట్లు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడం ఏ పంథా అని ఎద్దేవా చేసారు. సీఎం ను చూస్తూ వుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోంది. ప్ర నీతులు చెప్పే ముందు తాను వెనక్కి చూసుకోవాలన్నారు. అత్యంత భాద్యతా రాహిత్యంతో, గెలుపు అహంభావంతో కేసీఆర్ మాట్లాడారు. ఆయన చేసేవన్నీ నీతి మాలిన పనులు. మరో వైపు నీతులు వల్లె వేస్తూ విపక్షాలపై నోరు పారేసు కోవడం ఆయనకే చెల్లిందన్నారు. కిలో చికెన్ ఇవ్వకుండా, మద్యం ఇవ్వకుండా, 2 వేల నోటు ఇవ్వకుండా ఎలా గెలిచారో ఆయన అంతరాత్మకు వదిలేస్తున్నామని అన్నారు. తాను కొలిచే యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ్మ స్వామి, లేదా తాను కొలిచే అమ్మ వారిపై ప్రమాణం చేసి చెప్పమనండి ఇవేవి లేకుండా హుజూర్ నగర్ లో గెలిచానని కెసిఆర్ చెప్పాలని సవాల్ విసిరారు దాసోజు.

ఒక తిమింగలం వలె వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతులను కాలరాస్తూ, ఆధిపత్య అహంకారంతో ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులకు కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని మరిచి పోయి కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి పోయి దిగజారి మాట్లాడారు. తనను దిక్కరంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతారా అనే అక్కసు తో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బేవకూఫ్ లని, బుద్ధి జ్ఞానం లేదని, ఇష్టానుసారం మాట్లాడారు.

సీయం అనే వ్యక్తి తండ్రి లాంటి వారు. పిల్లలు అలిగితే తండ్రి సముదాయించడం సహజం. కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన వ్యక్తి కార్మికుల కడుపులో తన్నినట్లు వ్యవహారం చేస్తూ, తన మాట వినకపోతే కానీ వినక పోతే వాల్ల జీవితాలు నాశనం చేస్తాను అన్నట్లు రెచ్చి పోయి వ్యవహరించడం సబబు కాదన్నారు.

కరీంనగర్ ఎన్నికల సభలో ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పిన మీరే మాట మార్చారు. కార్మికులను తక్కువ చేసి టార్గెట్ చేశారు. యూనియన్ల వల్లనే ఆర్టీసీ కి నష్టం అన్న కెసిఆర్ టీఎంయూ ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని నిలదీశారు. . ఈ సంఘానికి హరీష్ రావు గౌరవ అధ్యక్షుడు గా యెట్లా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా సకల జనుల సమ్మెలో పాల్గొనాలని కోరలేదా, నువ్వు ఉద్యమ సమయంలో వారితో కలిసి భోజనం చేయలేదా అని ప్రశ్నించారు. సరే నీ అవసరం కోసం వారిని వాడుకున్నావు. ఇప్పుడు పవర్ లోకి వచ్చాక వారిని వదిలేశావు. ఇప్పుడు సమ్మె చేయడం నేరమంటున్నావు. ఇదెక్కడి నీతి అని దాసుజు నిలదీశారు.

ఎవడయ్యా అని ఒక జర్నలిస్టును బేవకూఫ్ అంటూ మాట్లాడారు. . దసరా పండుగ చేసుకోకుంట కార్మికులు, వారి కుటుంబాలు ఓ వైపు పస్తులు పడుతుంటే, వారి బాధను గుర్తించ కుండా కెసిఆర్ తో సహా తెరాస పెద్దలు వెకిలి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడారు. జర్నలిస్టులని అందరిని బెదిరిస్తూ కేసీఆర్ మాట్లాడారు. కడుపు మండి కార్మికులు ఒక మాట మాట్లాడితే ఆ ఒక్క దానిని మనసులో పెట్టుకుని 50 వేల మంది కార్మికులను పొట్ట గొట్టాడన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని దయ్యం అని,, మన్మోహన్ సింగ్ ని అటెండర్ అని కెసిఆర్ పలుమార్లు అనరాని మాటలు అన్నారని, . అయినా భేషజాలకు పోకుండా కేసీఆర్ తో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయాన్నీ కేసీఆర్ మర్చి పోయారా అని ప్రశ్నించారు.

ఆర్టీసీకి సంబంధించిన లెక్కలను కాగ్ కు కూడా ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీకి సంబంధించి అప్పుల మీద ఆస్తుల మీద ఆదాయం మీద ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరారు. మీరేమో చెట్ల మీద విస్తరాకులు కుట్టినట్లు ఇష్టం వచ్చినట్లు మారుతున్నారు. కెసిఆర్ 5 ఏళ్లలో 4250 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతుంటే, ఆర్టీసీ కార్మికులు కేవలం 5 ఏళ్లలో 712 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వాళ్ళ వాదన. ఎవరు నిజం ఎవరు అబద్ధం. అందుకే హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో ఆర్టీసీ ఆస్తులపై, అప్పులపై, ఆదాయం పై సమగ్ర విచారణ జరిపించాలని శ్రవణ్ డిమాండ్ చేసిండు.

వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆర్టీసీ కి ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడి అయ్యిందన్నారు. వాటన్నింటిని ప్రైవేట్ పరం చేయాలనీ కుట్ర కు తెర తీసింది అని ఆరోపించాడు. ఆర్టీసీ సేవా సంస్థ నా, లేక లాభాపేక్ష ఉన్న ప్రైవేట్ సంస్థ నా అని ప్రశ్నించారు. ఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఎండీని నియమించలేదు. సీఎం రోజు వారీగా ఈ సంస్థను మానిటరింగ్ చేయలేడు. కావాలని ఆర్టీసీని సమ్మెలోకి నెట్టి వేసిన ఘనత కేసీఆర్ దే నని ధ్వజమెత్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజలను నిలువు దోపిడీకి పాల్పడుతు లాభాలు ఆర్జిస్తున్రు ఇది సీఎం కు తెలియదా అని ప్రశ్నించిండ్రు.

కార్మికులపట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా వక్ర భాష్యాలు మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఆర్టీసీ, కార్మిక శాఖల మంత్రిగా పనిచేసిన కెసిఆర్ కు కార్మిక చట్టాల పై కనీస అవగాహన లేనట్లు, సోయి లేకుండా సమ్మెలు చేయొద్దని, ట్రేడ్ యూనియన్లు వద్దంటున్నారు. లక్షల్లో జీతం తీసుకుంటున్న మీరు ఆఫీస్ కు రాకుండా ఉంటున్నారు. మరి మీకెందుకు జీతమని దాసుజు నిలదీశారు.

అత్యున్నత న్యాయ స్థానం ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వమని ఆదేశించిన స్పందించక పోగా, ఇవ్వకపోతే కోర్టు కొడుతదా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా అని ప్రశ్నించిండు. కేంద్రం కొత్తగా తెచ్చిన మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణకే వర్తిస్తదా ..మరి ఏపీలో జగన్ కు వర్తించదా అని ప్రశ్నించిండు. మరి ఏపి లో ప్రభుత్వం లో విలీనం చేసినట్లు తెలంగాణ లో ఎందుకు చేయడం లేదు అని నిలదీసింది.

తాను రోడ్డు రవాణా శాఖా మంత్రిగా ఆరోజు విశాఖ పోయిన, టాయిలెట్స్ చూశానని తద్వారా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టానని చెప్పిన కెసిఆర్, మరి ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ని లాభాల బాటలో పెట్టేందుకు అదే తెలివిని ఎందుకు రావాణా శాఖా అధికారులు, రవాణా మంత్రికి ఇవ్వలేక పోయారని ప్రశ్నించిండు. ఒక వేళ వాళ్లు దద్దమ్మలు అయితే, స్వయంగా కెసిఆర్ ఆరేళ్లుగా తాను ఎందుకు తాను మంత్రిగా చేసిన ప్రయత్నం చేయలేక పోయారని దాసోజు ప్రశ్నించారు.

సంఘాలు వద్దు, యూనియన్లు వద్దు అంటున్న కేసీఆర్ టీఎన్ జిఓ , టీజీవో సంఘాల నేతలతో సీఎం ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. డూడూ బసవన్నలతో మాట్లాడతాడు..కానీ హక్కులను ప్రశ్నించే వారిని మాత్రం ఒప్పుకోడు అని నిలదీసిండు.

తెలంగాణను అప్పుల రాష్ట్రం గా మార్చిన కెసిఆర్ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలా అని దాసుజు ప్రశ్నించారు. నిజం షుగర్ ఫ్యాక్టరీ తో సహా నిజాం వారసత్వ సంపద ని అయిన ఆర్టీసీ ని ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. ఇలాగే చేస్తే కాసిం రజివికి పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చించాలని డిమాండ్ చేసారు.

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సంక్రాంతి స్పెషల్...పవన్ మరో సినిమా అప్డేట్

సంక్రాంతి స్పెషల్…పవన్ మరో సినిమా అప్డేట్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

చైనాతో ఉద్రిక్త‌త‌లు- 5వేల కోట్ల‌తో అత్య‌వ‌స‌రంగా ఆయుధాలు కొన్న భార‌త్

చైనాతో ఉద్రిక్త‌త‌లు- 5వేల కోట్ల‌తో అత్య‌వ‌స‌రంగా ఆయుధాలు కొన్న భార‌త్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)