దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
సీఎం కేసీఆర్ దళిత బంధును అంటూ డ్రామా ఆడుతున్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారు. ప్రజలు త్వరలోనే తిరగబడే రోజు వస్తుంది. హుజురాబాద్‌లో ప్రభుత్వ సమావేశమా.. పార్టీ సమావేశమా..? నిన్నటి మీటింగ్‌లో పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉన్నారు?
సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ కర్ణన్ కూడా పింక్ కలర్‌లో హోర్డింగ్ లు పెడుతున్నారు. కేసీఆర్.. తాలిబన్ల మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ.. క్రెడిబులిటీ పోగొట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత దళిత బంధు ఉండదు. 7 ఏళ్లలో సీఎంగా కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదు.
తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి ఓ దళిత బిడ్డ. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ విషయంలో కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారు. నేరెళ్లలో దళితుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. దళితులు దూరం అయ్యారనే కొత్త డ్రామా కు తెరలేపారు. పది లక్షలకు అర్హులైన వారందరికీ బాండ్లు రిలీజ్ చేయాలి. సోయి విజ్ఞత లేకుండా అధికారులకు పది లక్షలు ఇస్తామని చెప్పారు.
మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో ప్రగతి భవన్ లోకి దళిత ఐఏఎస్ కు అడుగుపెడుతున్నారు. ఏడేళ్లలో దళితులకు లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా చేయలేదు. ఏడేళ్లలో దళితులకు వాటాగా రావాల్సిన నిధులలో 65 శాతం పక్కదారి పట్టించారు. తెలంగాణ హైకోర్టులో ఒక్క దళితుడు కూడా జడ్జిగా నియామకం జరగలేదు.