కుటుంబంలో కూతుళ్ల కంటే కూడా కోడలికి ఎక్కువ హక్కు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వ హక్కులు అన్నీ కోడలుకే ఉంటాయని స్పష్టం చేసింది. విధవరాలైన కోడళ్లను కుటుంబ వారసుల జాబితాలో చేర్చుతూ చట్టాన్ని సవరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంలో 2019 ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేయాలని సూచించింది.
కోడలికి ఉండే హక్కుల విషయంలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు ఉంటాయి. కానీ.. ఉత్తర్‌ప్రదేశ్ నిత్యవసర వస్తువుల చట్టం 2016లో కోడలిని కుటుంబ సభ్యురాలిగా పేర్కొనలేదు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోడలు కుటుంబంలో సభ్యురాలు కాదని ఆదేశాలిచ్చింది. దీనివల్ల ఇంటికి వచ్చే కోడలు తన హక్కులు కోల్పోతుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. వీటపై అధ్యయనం చేసిన న్యాయస్థానం… నిజానికి కన్న కూతురి కంటే కోడలికే కుటుంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని వెల్లడించింది.