సినిమా పరిశ్రమలో ఒకసారి అడుగు పెట్టిన తర్వాత వారి వారసులను కూడా తీసుకు రావడానికి నటులు చాలా వరకు కష్టపడతారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టార్ హీరోలు ఇలాగే తమ వారసులను పరిచయం చేసారు. ఇక చిన్న చిన్న పాత్రలు చేసే వారి దగ్గర నుంచి పెద్ద నటుల వరకు అందరూ ఇదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Also Read:నెల్లూరుకు గౌతం రెడ్డి భౌతికకాయం.. రేపు అంత్యక్రియలు
అలా మన తెలుగు కమెడియన్ లు కూడా కొందరిని స్క్రీన్ కి పరిచయం చేసారు. తాము నటిస్తూనే తమ వారసులను కూడా స్క్రీన్ కు పరిచయం చేస్తూ వచ్చారు. వారిని అందరికి పరిచయం చేస్తూ మంచి అవకాశాలు వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా మన తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఏవీఎస్ కూడా తన కుమార్తెను స్క్రీన్ కు పరిచయం చేసారు.
అయితే ఆమె నటి అనే విషయం చాలా మందికి తెలియదు. ఏవీఎస్ అసలు పేరు… ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగు సినిమాలో నటుడిగా, రచయితగా నిర్మాతగా కూడా సేవలు అందించారు. ఇక కూతుర్ని ఆయన ఉండగానే స్క్రీన్ కు పరిచయం చేసారు. ఆమె కొన్ని సినిమాల్లో కనిపించి అలరించారు. ఇక ఆయన అల్లుడు కూడా సినిమా పరిశ్రమలో సెటిల్ అయ్యారు. ఆయన అల్లుడి పేరు… దావగుడి శ్రీనివాస్. ఆయనను చింటూ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. 2013 లో కాలేయ వ్యాధితో ఏవీఎస్ ప్రాణాలు కోల్పోయారు.
Also Read:భారీగా తగ్గిన కరోనా కేసులు