
మద్యానికి బానిసైతే బతుకు ఎంత దుర్భరంగా మారుతుందో తెలిసిందే. కానీ మద్యం రక్కసి అనుబంధాలను ఎంతలా చిన్నాభిన్నం చేస్తుందో హైదరాబాద్ బాలానగర్ జగద్గీర్‌గుట్టలోని సీసాల బస్తీలో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. మాసాని రాజు అనే వ్యక్తికి మద్యం సేవించడం అలవాటు.ఫ్రెండ్ సర్కిల్ మూలంగా ఆ వ్యసనం మరింత శృతిమించింది. పీకలదాక తాగొచ్చి ఇంట్లో నరకం చూపేవాడు. ఎదిగిన బిడ్డలున్నారే విచక్షణ కూడా లేకుండా వాళ్ల కళ్లెదుటే భార్యను హింసించేవాడు. మైకంలో కూతుళ్లపై కూడా చేయిచేసుకునేవాడు. వాళ్లు భయపడేవాళ్లు.తమను ప్రేమగా చూసుకునే తండ్రి మద్యం తాగితే రాక్షసుడిలా మారడం చూసి