సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు సభ్యుడు, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొన్ని రోజులుగా తెలుగు పాటలకు టిక్ టాక్ చేస్తూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల `అలవైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ కి అదరగొట్టిన వార్నర్…తాజాగా రాములో రాముల సాంగ్ కి చేసి అందరిని ఆకట్టుకున్నాడు.
ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్. చించేశారు అంటూ ట్వీట్ చేశారు అల్లుఅర్జున్. ఈ ట్వీట్‌కు వార్నర్ స్పందిస్తూ.. `ఏదో నా వంతు ప్రయత్నం చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయ`ని రిప్లై ఇచ్చాడు.
Trying my best and I love that dance and song ??? https://t.co/GCwV8X59JY
— David Warner (@davidwarner31) May 13, 2020