సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే అతికొద్ది మంది ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకరు. సన్ రైజర్స్ కు ఎన్నో మరుపురాని విజయాలందించిన వార్నర్ ఇప్పుడు గుడ్ బై చెప్పబోతున్నాడా…? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ దశలో కెప్టెన్ గా తప్పుకోగా, కొన్ని సందర్భాల్లో ఫాం లేని కారణంగా తుది జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.
అయితే, జట్టులో చోటు సంపాదించి తన ప్రత్యేకత చాటుకునే వార్నర్… మళ్లీ తుది జట్టులో కనిపించలేదు. అంతేకాదు డగౌట్ లోనూ వార్నర్ జాడ లేదు. దీంతో అంతా వార్నర్ ఏమయ్యారు అని చర్చించుకుంటున్న సమయంలో ఓ అభిమాని ఇన్ స్టాలో మీరు కనపడలేదు… ఎందుకు మిస్సయారని ప్రశ్నించగా, ఇక నుండి కనపడకపోవచ్చు… మీ సపోర్ట్ మాత్రం కొనసాగించండి అంటూ కామెంట్ చేశాడు. దీంతో వార్నర్ సన్ రైజర్స్ బంధం ముగిసినట్లేనన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
వార్నర్ ను తప్పించటంపై జట్టు యాజమాన్యం స్పందించింది. సన్ రైజర్స్ ఇక ప్లే ఆఫ్స్ కు దూరమైనందున… కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చి, వారిలోని ప్రతిభకు సానబెట్టె ఉద్దేశంతోనే వార్నర్ ను తీసుకోలేదని, వార్నర్ హోటల్ రూం నుండే కొత్త కుర్రాళ్ల ఆటను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.