మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దానికి ముఖ్య కారణం తమన్ సంగీతం అనే చెప్పాలి. ఇప్పటికే పలు రికార్డులను ఈ సైతం ఈ సినిమా పాటలు సొంతం చేసుకున్నాయి.
తాజాగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట యూట్యూబ్ లో 450 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్, సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇంస్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. వెల్ డన్ అల్లు అర్జున్ అంటూ కామెంట్ చేశారు. ఇక గతంలో లో బుట్ట బొమ్మ పాటకి డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియోలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టాయి.