సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు పాటలకు డాన్సులు చేస్తూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠ పురములోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ కు వార్నర్ వేసిన స్టెప్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా మహేష్ నటించిన మహర్షి సినిమాలోని కొన్ని సన్నివేశాలను సెలెక్ట్ చేసుకొని రీ ఫేస్ యాప్ ద్వారా వీడియోను ఎడిట్ చేశాడు. మహేష్ కు బదులుగా తన ఫేస్ ను యాడ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.