అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోని కరాచీలో నివాసం ఉంటున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి దావూద్ మేనల్లుడు అలీషా సమాచారం అందించాడు.
దావూద్ తో తన కుటుంబం టచ్ లో లేదని అలీ షా తెలిపారు. అయితే దావూద్ భార్య మెహజబీన్ పండుగల సమయంలో తన భార్య, తల్లితో ఫోన్ లో మాట్లాడుతుందని అలీ ఈడీ దర్యాప్తులో వెల్లడించాడు.
దక్షిణ ముంబైలోని డంబర్ వాలా భవనంలో 1986 వరకు తన మేనమామ దావూద్ ఉండేవాడని తెలిపాడు. ప్రస్తుతం అతను కరాచీలో ఉంటున్నట్టు తన బంధువుల, ఇతర వర్గాల నుంచి తనకు తెలిసిందని ఈడీకి వివరించాడు.
తాను పుట్టే సమయానికే దావూద్ దేశం విడిచివెళ్లిపోయాడని అలీషా పేర్కొన్నాడు. మరో వైపు అలీషా మామ ఇక్బాల్ కస్కర్ ను ఈడీ బృందం ప్రశ్నిస్తోంది. అతను కూడా ఈడీకి కీలక సమాచారం అందిచినట్టు సమాచారం.