పంజాబ్ లోని లూధియానాలో పట్టపగలే భారీ దోపిడి జరిగింది. ఐదుగురు దొంగలు గిల్ రోడ్ ఏరియాలో గల గోల్డ్ లోన్ బ్యాంక్ నుంచి తుపాకీతో సిబ్బందిని బెదిరించి 30 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దొంగిలించిన మొత్తం బంగారం విలువ రూ.12 కోట్లు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి ఎదురుగానే పంజాబ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీస్ ఉంది. ఈ సంఘటనకు 25 నిమిషాల ముందు దొంగలు నగరంలోని ఇండియా ఇన్ఫో లైన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ ను టార్గెట్ చేశారు. నలుగురు బ్యాంక్ లోకి ప్రవేశించగా…ఒకతను బయట కారులో ఎదరుచూస్తున్నారు. కొంత సేపటి తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీ పుటేజ్ లో నలుగురు మాస్కులు ధరించి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.