తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. ఇలాంటి తరుణంలో కొంతమంది కారణంగా పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోందన్నారు అద్దంకి దయాకర్. గాంధీభవన్ లో మాడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బ్రిటీష్ పాలన లాగే.. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చీలికలు చేసి పాలిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతల మీటింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ లో గెలిచిన నేతలను డబ్బుల ఆశ చూపి తమవైపునకు తిప్పుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు చేరితే తప్ప టీఆర్ఎస్ బలపడే పరిస్థితి లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాతనే.. అన్ని సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. తమలో తమకు గొడవలు పెట్టడానికే.. మంత్రి హరీష్ రావు కోకాపేటలో వీహెచ్ ని కలిశారని ఆరోపించారు.
Advertisements
పార్టీలో సమస్యలు ఉంటే కొట్లాడాలి కానీ.. శత్రువు దగ్గర మోకరిల్లితే ఎలా అని ప్రశ్నించారు. పార్టీలో అంతర్గత సమావేశంలో ఏమైనా ఉంటే మాట్లడండి కానీ.. శత్రువు దగ్గర రహస్య సమావేశాలకు తావు ఇవ్వొద్దని సూచించారు అద్దంకి దయాకర్.