రెండు రోజులుగా హీరోయిన్ డింపుల్ హయతి వార్తల్లో నిలిచింది. తన అపార్ట్మెంట్స్ లోనే నివసించే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా గొడవ పడుతుంది డింపుల్. ఈ నేపథ్యంలో డీసీపీ వాడే ప్రభుత్వ కారుని తన్నింది అని, కారుతో ఢీ కొట్టిందని డీసీపీ డ్రైవర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్, ఆమె బాయ్ ఫ్రెండ్ పై కేసు నమోదు చేశారు.
అయితే డింపుల్ ది తప్పేమి లేదని, డీసీపీ నే తనతో ర్యాష్ గా మాట్లాడాడని డింపుల్ కేసు పెట్టబోతే పోలీసులు తీసుకోలేదు. దీంతో సెటైరికల్ గా పోలీసులపై ట్వీట్ చేసి న్యాయపరంగానే వెళ్తామని తన లాయర్ తో మాట్లాడించింది. ఆల్రెడీ డింపుల్ లాయర్.. డీసీపీ కావాలని చేస్తున్నారని, డింపుల్ ని వేధిస్తున్నారని, కేసు పెడితే పోలీసులు తీసుకోవట్లేదని, తప్పంతా తనవైపు ఉంచుకొని ఒక సెలబ్రిటిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
తాజాగా డింపుల్ హయతి లాయర్ మరోసారి మీడియాతో మాట్లాడారు. డింఎఫ్ఐఆర్ లో పెట్టారు. డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ బయట పెట్టండి. డీసీపీ అబద్దాలు ఆడుతున్నాడు. తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నాడు. డ్రైవర్ ఎందుకు బయటకు రావడం లేదు. ట్రాఫిక్ పోలీసులు బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెట్టారు.
తప్పును కవర్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ కార్ కు ఎవరూ కవర్ పెట్టరు. డీసీపీ బిహేవియర్ బాగాలేకనే డింపుల్ గతంలో వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా తట్టుకోలేకనే తప్పుడు కేసు పెట్టారు. డీసీపీ బాధ్యత తగ్గట్టు పని చేయడం లేదు. ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. 41a section కింద కేసు ఉంది అని అన్నారు.