కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడిచిన రెండేళ్లలో కొవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహమ్మారిపై సరైన అవగాహన లేని కొందరు ఆ జబ్బును బయటకు చెప్పుకోలేకపోయారు. దీంతో కనీసం మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోకుండా కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు జరిపించారు. ఇప్పుడు పరిహారం కోసం అందుకు సంబంధించిన దస్త్రాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి బాదిత కుటుంబాలు.
