రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాదన్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలంలోని కాళీ మందిర్ సాయి బాబా కాలనీలో నివాసం ఉండే ఉరడి భీమయ్య పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి సాధన ఆసుపత్రిలో 3 రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. అయితే ఆపరేషన్ తర్వాత వైద్యం వికటించి భీమయ్య మృతిచెందాడు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భీమయ్య భార్య స్వాతి తనకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ నుంచి తన భర్త శవాన్ని తీసుకెళ్లే ప్రశక్తే లేదని కూర్చుంది. మృతుడి బంధువులు కూడా హాస్పిటల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.