– 5వేల మందికి పైనే మృతి
– అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
– రెండు రోజులపాటు ఐదు భూకంపాలు
– శిధిలాల కింద వందల మంది
– సహాయక చర్యల్లో భారత్ బృందాలు
– శిధిలాల కిందే ఓ గర్భిణీ ప్రసవం
– వైరల్ అవుతున్న అక్కా తమ్ముళ్ల కథ
– కన్నీటి పర్యంతమైన భారత ప్రధాని
– కేటీఆర్ సహా ఇతర నేతల విచారం .
టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం మూడు భారీ భూకంపాలు సంభవించగా మంగళవారం రెండు వణికించాయని అధికారులు తెలిపారు. మొదట 7.8, ఆ తర్వాత 7.6 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు వచ్చాయని వెల్లడించారు. మూడోది 7.5 తీవ్రతలో నాలుగోది 5.9, ఐదోది 5.4 తీవ్రతతో వచ్చినట్టు వివరించారు. దీంతో ఇంకా ఏ ఉపద్రవం ముంచుకు రానుందోనని టర్కీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
భూకంపాల నేపథ్యంలో పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. జనం గాఢ నిద్రలో ఉండగా భూకంపం రావడంతో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. భవన శిథిలాల కింద ఉన్న మృతదేహాలను, క్షతగాత్రులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ నుంచి కూడా సహాయక బృందాలు వెళ్లాయి. భారీ భూకంపాల నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు చెప్పారు.
ఇప్పటికే మృతుల సంఖ్య 5వేలు ధాటినట్టు స్థానిక మీడియా తెలిపింది. టర్కీలో సుమారు 4 వేల మంది, సిరియాలో, 1602 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. అలాగే, టర్కీలో 20,534, సిరియాలో 3,649 మందికి తీవ్రంగా గాయపడ్డినట్టు వెల్లడించింది.
భూకంపం ధాటికి టర్కీలో 11వేలకు పైగా భవనాలు కూలిపోయాయి. సుమారు 25వేల మంది ఎమర్జెన్సీ వర్కర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను తరలించేందుకు 10 నౌకలు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. ఈ పెను విషాదానికి సంబంధించి ఇతర దేశాధినేతలు, కీలక నాయకులు స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు.