జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి 9 మంది చనిపోయినట్లు చెబుతున్నారు అధికారులు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్న ఆయన.. 9 మంది చనిపోయినట్లు తెలిపారు. లారీ, బస్సు క్రాస్ అవుతుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఎవరి తప్పు ఏంటనేది విచారణ చేస్తామన్నారు. 13 మందిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించామని.. మరికొందరు ఆటోల్లో ఇళ్లకు వెళ్లిపోయారని తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరం చేశామన్న పేర్ని… ఎంత ఖర్చయినా పర్వాలేదు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.