ఆ పెద్దావిడకి 81 యేళ్ళుంటాయ్. అనారోగ్యంతో మంచం పట్టింది.పోరాడి పోరాడి ఆఖరికి ఊపిరి వదిలేసింది. డాక్టర్లు కూడా నో మోర్ అని తేల్చాసారు. ఇక అంతా అపోయింది అనుకున్నారు. పేకప్ చెప్పి, పిడకలు పేర్చేసారు. కాసేపటికి ఎందుకో ఆ పిడకలు ఓ రకమైన ఫ్రీక్వెన్సీలో ఊగుతున్నాయ్.
ఒకప్పుడు అదే ఫ్రీక్వెన్సీ అందరూ ఆపెద్దావిడలో చూసినవాళ్ళే .! డౌటొచ్చి పిడకలు పరికించారు. ఇంకేముంది..!ఆమె హాయిగా ఊపిరితీసుకుంటుంది. ఆమె యమలోకం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ భూలోకంలోకి వచ్చేసిందని కన్ఫమ్ చేసుకున్నారు.
ఇక అంతా సిచ్యుయేషన్ మొత్తం మారిపోయింది.81 ఏళ్ళ బామ్మ మళ్ళీ పుట్టింది. అప్పటిదాకా ఏడ్చిన వాళ్ళు నవ్వడం. నవ్విన వాళ్ళు ఏడ్వడం లాంటి తతంగాలన్నీ అక్కడే పూర్తయ్యాయి. స్మశానానికి ఏడుస్తూ వచ్చిన పాడె…నవ్వుతూ ఇంటికి వెళ్ళింది.ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్ ఫిరోజా బాద్ లో జరిగింది.
హరిభేజి అనే 81 ఏండ్ల వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న హరిభేజి ఈ నెల 3న మెదడులో రక్తం గడ్డకట్టడంతో చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.
దాంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులందరూ హరిభేజిని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు విచ్చేశారు. ఇక కుటుంబసభ్యులు ఇంటి దగ్గర సంప్రదాయం ప్రకారం జరగాల్సిన తంతంతా పూర్తిచేసి పాడెపై ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు.