రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూ.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజూమున ఓ వీడియోను పోస్ట్ చేశాడు తనను ఉద్యమ ద్రోహి, దేశద్రోహి అంటూ రైతు సంఘాలు, పోలీసులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచాడు. వీడియోలో దీప్ సిద్ధూ ఏమన్నాడంటే..
రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నట్టు నేను దేశద్రోహిని కాదు. ఎర్రకోటవైపు రైతులకు నేను మళ్లించలేదు. వారిని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించలేదు. నేను చెప్పినట్టు వారు వింటే.. మీరెందుకు రైతు సంఘాల నాయకులు అవుతారు. నాకు ప్రజల మద్దతు లేదని రైతు నాయకులే గతంలో అన్నారు. మళ్లీ వారే రైతులని రెచ్చగొట్టానని ఆరోపిస్తున్నారు. మద్దతే లేని వ్యక్తి అంతమందికి ఎలా నాయకత్వం వహిస్తాడో చెప్పండి అంటూ దీప్ సిద్ధూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.