బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ కు బంధించి గత కొన్ని రోజులుగా తెరపైకి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలంపిక్స్ పతకాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది పి.వి.సింధు. ఇదిలాఉండగా పీవీ సింధు బయోపిక్ లో నటించడానికి దీపికా పడుకునే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా పీవీ సింధు మాట్లాడుతూ బయోపిక్ లో దీపిక నటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు ఆమె చెప్పినట్టుగానే ఆమె కోరిక నెరవేరబోతోంది.
అంతేకాక దీపికా పడుకునే స్వయంగా నిర్మించబోతున్నారట. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా సమాచారం. ఇక బాడ్మింటన్ లో నేషనల్ లెవల్ ఛాంపియన్ షిప్ లో ఆడిన అనుభవం దీపిక కు ఉండటం తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.