బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రభాస్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపిక, ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కాగా హైదరాబాద్‌లో ప్రభాస్ దీపికపై షూట్ కు ప్లాన్ చేశారు మేకర్స్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షూటింగ్ జరగనుందట. ఇక ప్రాజెక్ట్ K ఊహాత్మక మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించబడుతుందట.
యాక్షన్ అభిమానులను ఆహ్లాదపరిచేలా ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.