టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కాగా తాజాగా ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంను బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.
మీరు ఏ నటుడితో కలిసి నటించాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు దీపిక వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ది అద్భుతమైన వ్యక్తిత్వం కూడా తెలిపింది. అయితే దీపికా మాటలు విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న తో దీపికా సినిమా చేయాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దీపికా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో.
ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించారు.
దీని తరువాత కొరటాల శివ తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇందులో అలియాభట్ హీరోయిన్ గా నటించబోతుంది.