బాలీవుడ్ నటి దీపికా పడుకొనే నటించిన ”చపక్” సినిమా ట్రెయిలర్ ఈరోజు ముంబైలో విడుదలైంది. నటుడు విక్రాంత్ మాసే, డైరెక్టర్ మేఘనా గుల్జర్ తో కలిసి ట్రెయిలర్ ”లాంచింగ్” కార్యక్రమానికి దీపికా హాజరైంది. కార్యక్రమంలో సినిమా గురించి మాట్లాడుతూ దీపికా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైంది. తాను మాట్లాడలేని స్థితిలో కార్యక్రమాన్ని కొనసాగించమని నిర్మాతను కోరింది. మేఘనా గుల్జర్ వెంటనే దీపిక దగ్గరకొచ్చి ఆమెను ఓదార్చారు. దీపికా భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చపక్ సినిమా యాసిడ్ దాడి బాధతురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మీ పాత్రదారిగా దీపికా నటిస్తున్నారు.