ఫ్యాషన్ కు పెట్టింది పేరుగా ఉంటుంది దీపికా పదుకొణె. ఆమె ధరించే ఏ దుస్తులైనా సరే ఆమె అభిమానులతో పాటు చూసే ప్రేక్షకుల మనసులను కూడా హత్తుకున్నట్లు ఉంటాయి. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఎంజాయ్ చేస్తోంది ఈ భామ.
దీపికా ఈ ఫ్యాషన్ వీక్ లో మినీ డ్రెస్ ధరించిన కొన్ని చిత్రాలను నెట్టింట్లో అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు చిట్టి పొట్టి డ్రెస్ లో దీపికా మరింతా ముద్దొస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఎల్‌వీ రిసార్ట్ 2023 కలెక్షన్ నుంచి దీపికా మినీ దుస్తులను ధరించింది. ఆమె చిక్ లుక్ కు ఫ్యాషన్ స్టైలిస్ట్ షాలీనా నథాని, డైరెక్టర్ నికోలస్ ఘెస్క్వియర్‌లు బాధ్యత చేపట్టారు. దీపికా స్లీవ్ లెస్ , ఉన్నితో తయారు చేసిన దుస్తులను ఈ శరదృతువులో ధరించింది.
వెండి, బంగారం దారాలతో ఎంతో అందంగా డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించింది. రెండు ఫ్రిల్డ్ టైర్‌లతో క్లోజ్-నెక్ మోకాలి ఎత్తుకు చేరుకున్న నల్లని తోటు బూట్ లను ధరించింది. ఆ డ్రెస్ ఖరీదు దాదాపు లక్ష రూపాయల పైనే ఉంటుంది. దీపికా మేకప్ కూడా చూపరులను కట్టిపడేసేలా ఉంది మాస్కరా, మెరూన్ కలర్ లిప్ స్టిక్ తో పాటు మెరిసే ఐషాడో కూడా వేసుకుంది.