బాలీవుడ్ లో క్రేజీ కపుల్స్ అనగానే గుర్తుకొచ్చేది దీపికా, రణ్‌వీర్ జంట. వరుస హిట్‌లతో దూసుకపోతుంది ఈ జంట. దీపికా ఫిమేల్ సెంట్రిక్ మూవీలతో ముందుకు నడుస్తుంది. అయితే షూటింగ్ సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో మాత్రం దీపికతోనే ఉంటానంటున్నాడు రణ్ వీర్.
తాజాగా ఈ జంట ఓ షోలో బెడ్ రూం విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఓ అవార్డు ఫంక్షన్ లో కార్తీక్ ఆర్యన్ అడిగిన చిలిపి ప్రశ్నకు అంతే చిలిపిగా సమాధానం చెప్పారు. ఈ జంట. మీరు ఉదయాన్నే రోజు ఏ వైపు నుండి బెడ్ దిగుతారు అంటూ దీపికాని అడిగాడు కార్తీక్ ఆర్యన్. సిగ్గుపడుతూ నేను రోజు కుడివైపు దిగుతానంటూ చెప్పు కొచ్చింది. పక్కనే ఉన్న రణ్‌వీర్ తన చేతిలో ఉన్న మైక్ తీసుకొని… అవును తను కుడివైపు నుంచే దిగుతుంది. ఎందుకంటే ఎడమవైపు నేను ఉంటాను, తనని అంత త్వరగా మంచం దిగనివ్వను కదా అంటూ చెప్పుకొచ్చాడు. రణ్ వీర్ సమాధానం విన్న దీపికా ఒక్కసారి షాక్ కు గురై, ముఖం పక్కకు తిప్పుకుంది. ఫాన్స్ కూడా వీరిద్దరి అన్యోన్యతపై మురిసిపోతున్నారు.