బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె అందర్నీ కంగారు పెట్టేసింది. షూటింగ్ సమయంలో హార్ట్ బీట్ విపరీతంగా పెరిగిపోవడంతో హైదరాబాద్ లోని కామినేని ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
దీపికను పరీక్షించిన వైద్యులు.. తగిన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె నోవాటెల్ లో అబ్జర్వేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దీపికా ప్రస్తుతం కోలుకుంటోందని సినీ వర్గాలు వెల్లడించాయి. షూటింగ్ లో విశ్రాంతి లేకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం దీపిక.. ప్రభాస్ తో కలిసి సినిమా చేస్తోంది. దాని షూటింగ్ కోసమే నగరానికి వచ్చింది. ప్రాజెక్ట్ కే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ సంఘటనపై దీపికా ప్రతినిధులు గానీ, మూవీ టీమ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రాజెక్ట్ కే విషయానికొస్తే.. ప్రభాస్, దీపిక కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికను ఇంతకుముందు ఎన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్లు గతంలో ఓసారి దర్శకుడు అశ్విన్ తెలిపాడు.