బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె స్వయంగా ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. యాసిడ్ బాధితురాలు లక్ష్మి జీవిత ఆధారంగా తెరక్కిన చెపాక్ సినిమాలో దీపికా నటించింది. ఈ మూవీ ఇటీవల విడుదలై ప్రశంసలను అందుకుంటుంది. ఇటీవల యాసిడ్ దాడులను నిరోధించేందుకు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. యాసిడ్ అమ్మకం విషయంలో ప్రభుత్వం విధించిన రూల్స్ ను ఎంతమంది పాటిస్తున్నారో తెలుసుకునేందుకు దీపికా… చెపాక్ చిత్ర యూనిట్ తో కలిసి స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం యాసిడ్ అమ్మకం సమయంలో కొనుగోలుదారుని నుంచి గుర్తింపు కార్డు తీసుకొని అమ్మాలి. కానీ అమ్మకందారులు అవేవీ పట్టించుకోకుండా యాసిడ్ ను అమ్మేస్తూ రూల్స్ ను అతిక్రమిస్తున్నారు. ఎలాంటి గుర్తింపు కార్డు, అడ్రస్ కార్డు తీసుకోకుండానే 24యాసిడ్ బాటిళ్లు కొనుగోలు చేసి దేశంలో నిబంధనలను ఎలా బ్రేక్ చేస్తున్నారో ఈ బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. తాను చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోను దీపికా సామజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
Advertisements