ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే శీతాకాలం కూడా వస్తుండటంతో వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ వారం రోజుల నుంచి బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, అనన్య పాండే, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ వంటి వారు వారి సెలబ్రేషన్స్ ను అభిమానులతో పంచుకున్నారు.
నవరాత్రులు సందర్భంగా వారు ధరించిన దుస్తులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.వీరిలో బాలీవుడ్ జంట మహిప్ కపూర్ దంపతుల ముద్దుల కూతురు షానాయా కపూర్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నవరాత్రులను పురస్కరించుకొని ఆమె లెహంగా ధరించి అభిమానులను అలరించింది.
కరీనా కపూర్ ఈ సీజన్ లో స్వెట్ షర్టులను ఎక్కువగా ధరిస్తోంది. లూజ్ ఫిట్ జీన్స్‌తో ఆమె ధరించిన దుస్తులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అనన్య పాండే ఇప్పటి తరం హీరోయిన్లలో చేతినిండా చిత్రాలతో ముందుకు దూసుకుపోతోంది ఈ భామ. డెల్ కోర్ ప్యాంట్ సూట్, స్వరోవ్ స్కీ యాక్సెసరీస్ తో ఎంతో అందంగా ఉంది.
దీపికా పడుకొణె టర్టిల్ నెక్ బ్లౌజ్, స్లీవ్ లెస్ స్వెటర్, జీన్స్ వేసుకొని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక త్వరలో ఆదిపురుష్ చిత్రంలో సీతగా అలరించబోతున్న కృతి సనన్ జార్జియా హార్డిండ్ రిబ్డ్ డ్రెస్ లో బాడీకాన్ ఫిట్, స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో ఎంతో స్టైలిష్‌గా ఉంది.
ప్రియాంక చోప్రా లాపాయింట్ డ్రెస్ తో శాటిన్ గ్లామ్.. ఫుల్ స్లీవ్‌లు, టర్టిల్ నెక్, రచ్డ్ ఫీచర్ దుస్తులలో పండుగను బాగా జరుపుకుంటున్నారు.ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనార్కలి దుస్తులతో పాటు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను కూడా ధరిస్తూ అభిమానులకు కనుల విందు చేస్తుంది ఈ నీలి కళ్ల సుందరి.